Hyderabad: న్యూ పద్మా నర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటన

Hyderabad: ఎల్.బి.నగర్ చంపాపేట్ డివిజన్ న్యూ పద్మా నర్‌లో వరద పరిస్థితులను పరిశీలించి, తక్షణ చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 5 Aug 2026 3:28 PM IST
Hyderabad
X

Hyderabad: న్యూ పద్మా నర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటన

హైదరాబాద్: చంపాపేట్ డివిజన్‌లోని న్యూ పద్మా నగర్ కాలనీలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన వరద పరిస్థితులను ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. బాక్స్ డ్రెయిన్ల నుంచి వరద నీరు పొంగిపొర్లి ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

వంగ శంకరమ్మ ప్రాంతం నుంచి నిర్మించిన కొత్త బాక్స్ డ్రెయిన్ పనులు పూర్తయినా, డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడం, నిర్మాణ సమయంలో వినియోగించిన ఇసుక బస్తాలు, సెంటరింగ్ సామగ్రిని అక్కడే వదిలేయడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరద నీరు ఇండ్లలోకి చేరిందని స్థానికులు వివరించారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అన్ని బాక్స్ డ్రెయిన్లను వెంటనే తెరిచి పూడిక, చెత్తాచెదారం, నిర్మాణ సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. వరద నీరు ఎలాంటి అవరోధం లేకుండా సాఫీగా వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే న్యూ పద్మా నగర్‌తో పాటు పరిసర కాలనీల్లోనూ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, భవిష్యత్తులో ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో రాజిరెడ్డి, కృష్ణమాచారి, గండికోట శ్రీనాథ్, సదానంద రెడ్డి, రవి ముదిరాజ్, ఉమామహేశ్వర్, శివ, జగదీష్, సురేందర్ రెడ్డి, వసంత, వసంత్, రాజశేఖర్ రెడ్డి, అల్లంపల్లి శ్రీనివాస్, జయవర్ధన్ రెడ్డి, విజయనంద్ రెడ్డి, శ్రీను యాదవ్, శ్రీనుపంతులు, యాదయ్య, సుధాకర్ రెడ్డి, నరహరి రావుతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story