LB Nagar: ఇళ్లు పోతే మేమెలా బ్రతకాలి? రోడ్డు విస్తరణపై ఎల్.బి.నగర్ వాసుల ఆవేదన!

LB Nagar: టీకేఆర్ కమాన్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ప్రతిపాదించిన 200 అడుగుల రహదారి విస్తరణను విరమించుకోవాలని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Updated on: 7 May 2026 1:28 PM IST
LB Nagar
X

LB Nagar: ఇళ్లు పోతే మేమెలా బ్రతకాలి? రోడ్డు విస్తరణపై ఎల్.బి.నగర్ వాసుల ఆవేదన!

LB Nagar: ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో టీకేఆర్ కమాన్ జంక్షన్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ప్రతిపాదిత 200 అడుగుల రహదారి విస్తరణ మరియు 6 లేన్ ఫ్లైఓవర్/గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం వల్ల స్థానిక నివాసితులు తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో, ఆ ప్రతిపాదనను పునర్విచారించి విరామించుకోవాలని చేయాలని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కోరడం జరిగింది.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతు ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రస్తుత ఇన్నర్ రింగ్ రోడ్‌ను ఇరువైపులా 25 అడుగులు చొప్పున విస్తరించాలనుకోవడం వల్ల మార్గం వెంట ఉన్న వందలాది ఇళ్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.గతంలో 2004, 2007 సంవత్సరాల్లో జరిగిన 150 అడుగుల రహదారి విస్తరణలోనే అనేక కుటుంబాలు తమ ఇళ్లను పూర్తిగా లేదా భాగంగా కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు.అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో మా యొక్క ఇంటి స్థలాలు 200 గజాల స్థలం ఉంటే అప్పటి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 100 గజాలు మిగలడం జరిగింది అని, మళ్ళీ ప్రస్తుతం రోడ్డు విస్తరణ పేరిట ఉన్న ఇంటి స్థలం ఇచ్చి మేము ఎలా బ్రతకాలి అని అన్నారు.ప్రస్తుతం 200 అడుగుల విస్తరణ అమలు చేస్తే, ఇప్పటికే నష్టపోయిన కుటుంబాలు మరింత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.ఈ ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోచమ్మగడ్డ, మారుతి నగర్, న్యూ మారుతి నగర్, కాటికొంకుంట, సత్యనగర్, మయూరిపురం కాలనీ, మారుతి నగర్ (మందమల్లమ్మ) వంటి కాలనీలు ఉన్నాయని, సుమారు 272 నుండి 300 ఇళ్లు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రస్తుత 150 అడుగుల రహదారి ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తోందని,సర్వీస్ రోడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని, మిధాని డిపో నుండి మారుతి నగర్ వరకు ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మించబడిందని తెలిపారు.ఈ మార్గంలో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు లేవని స్పష్టం చేశారు.

ఇక్కడ ఉన్న 150 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల భవిష్యత్తులో దాదాపు మరో 25 సంవత్సరాల వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెలిపారు.ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదని అన్నారు.అనంతరం సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు మేము వ్యతిరేకం కాదని, కానీ అవసరం ఉన్న చోట్లే ఫ్లైఓవర్లు నిర్మించాలని అన్నారు. బండ్లగూడ ఆనంద నగర్ చౌరస్తా, హస్తినాపురం చౌరస్తా వంటి తీవ్ర ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల ఇళ్లు మరియు జీవనోపాధిని కాపాడే దృష్ట్యా 200 అడుగుల రహదారి విస్తరణ ప్రతిపాదనను వెంటనే పునర్విచారించలని ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కమిషనర్ గారిని కోరారు.అనంతరం కమీషనర్ గారు మాట్లాడుతూ అధికారులచే మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించి తగు నివేదిక తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో భారస నాయకులు రవి ముదిరాజ్,చలమల యాదిరెడ్డి,శ్రీనాధ్,కనకేష్ కాలనీవాసులు నవరత్నం,నర్సింహ చారి,జగదీశ్,శ్యామ్,శ్రీనివాస్ సాగర్,సుఖ్ జీవన్ రెడ్డి,సురేందర్ రెడ్డి,జైపాల్ రెడ్డి,సమీర్, గౌస్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story