LB Nagar: రూ. 1.44 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మధుయాష్కి గౌడ్

LB Nagar: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎల్బీనగర్ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 Aug 2026 5:01 PM IST
LB Nagar
X

LB Nagar: రూ. 1.44 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మధుయాష్కి గౌడ్

ఎల్బీనగర్: సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులకు ప్రత్యేక సహకారం అందిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. చంపాపేట డివిజన్లోని మారుతీ నగర్ కాలనీలో లో రూ. 1.44 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి గారు, సేవ దళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గార్లతో కలిసి మధుయాష్కి గౌడ్ గారు ఈరోజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. అభివృద్ధి కోసమని పార్టీ మారిన ఇక్కడి ఎమ్మెల్యే, ఏ అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేశాడని, సూర్యుడి కంటే ముందే లేస్తా అని డైలాగులు మాత్రమే చెప్పుకుంటున్నాడని విమర్శించారు. మూసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందాడే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.

రాజకీయాలకతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే నియోజకవర్గానికి నిధులు మంజూరయ్యాయని బిజెపి మాజీ కార్పొరేటర్లు సైతం పలు వేదికలపై మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు స్పందించి పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులను కాళేశ్వరానికి తరలించి కమీషన్లు దండుకొని తిన్నారని, సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం నగరంలో వసూలు చేసే పన్నులను ఇక్కడి అభివృద్ధి కే ఖర్చు చేస్తున్నారన్నారు.

నగరంలో మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. చంపాపేట డివిజన్లో గతంలో వరద ముంపు సమస్యలు ఉంటే, తాము రూ. 5కోట్ల నిధులతో పనులు చేయించి సమస్య తీర్చామన్నారు. డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎంపీగా ఈటల రాజేందర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు..? అని ప్రశ్నించారు.

ఇక్కడి ఎమ్మెల్యే 118 జీవో ద్వారా కన్వీనెంట్ డేట్ తీసుకొచ్చి ప్రజలకు బురిడీ కొట్టించాడన్నారు . మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని హడావుడిగా 118 జీఓ తీసుకొచ్చి.. ప్రజలు కష్టపడి కొనుక్కున్న ఇళ్లలో ప్రజలే కబ్జాదారులని కన్వీనియన్స్ డీడ్ లలో చూపించారని, ప్రజలతో పైసలు కట్టించి కన్వీనియన్స్ డీడ్ పేరిట చిత్తుకాగితాన్ని అందజేశారని విమర్శించారు.

SIR ఫేజ్ -2లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని.. 1,87,000 ఓట్లు నో మ్యాపింగ్ లో ఉన్నాయని, నోటీసులు అందుకునే అందరూ సరైన వివరాలు అందించి ఓట్లు నమోదు చేసుకోగలరని సూచించారు.

మల్రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మధుయాష్కి గౌడ్ గారి సహకారంతో వివిధ నియోజకవర్గంలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎల్బీనగర్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానమన్నారు. గత ప్రభుత్వంలో 100 కోట్ల నిధులు కూడా నియోజకవర్గానికి రాలేదని.. అభివృద్ధి పేరిట ఇక్కడి ఎమ్మెల్యే డ్రామాలు ఆడుతుంటాడని విమర్శించారు. మేము మంత్రిగారికి రోడ్లు, అభివృద్ధి విషయాలు చెప్పగానే.. ఎమ్మెల్యే వాటిపై మాట్లాడుతూ. తానే చేస్తున్నట్లు డ్రామాలు చేస్తుంటారని విమర్శించారు.

ఈ సందర్భంగా మధుయాష్కి గారు దుర్గాభవాని నగర్ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అధ్వానంగా మారిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. కబ్జాదారుల నుంచి ఇటీవల హైడ్రా కాపాడిన పార్కు స్థలాన్ని పరిశీలించారు. కాలనీవాసుల విన్నపం మేరకు పార్కుగా అభివృద్ధి చేస్తామని వివరించారు. పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రాను అభినందించారు. ఎస్సీ బస్తీ లోని నవజీవన్ జ్యోతి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పరిశీలించారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, సామ రమణారెడ్డి గారు, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల రవీందర్ గౌడ్ గారు, మాజీ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెగావత్ గణేష్ నాయక్ గారు, నాయకులు కారుకొండ శివ గారు, తోకటి కిరణ్ గారు, దుర్గా రెడ్డి గారు, బండ సురేందర్ గారు, జిల్లా స్పోర్ట్స్ పర్సన్ దాము మహేందర్ యాదవ్ గారు, జిల్లా కార్యదర్శి జక్కా సందీప్ గారు, నాయకులు సాయి నికేష్ గారు, అనసూయ గారు, సరిత గారు, యాదమ్మ గారు, వరలక్ష్మి గారు, భాగ్య, మాధవి గారు, కాలనీ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి గారు, రఘునందన్ రెడ్డి గారు, లలిత గారు తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story