LB Nagar: సరూర్‌నగర్ చెరువులో వైభవంగా తొలి గణపతి నిమజ్జనం

LB Nagar: ఎల్‌బీనగర్ సరూర్‌నగర్ చెరువులో ప్రారంభమైన వినాయక నిమజ్జనాలు. కొత్తపేట వాసులు సతీష్ దంపతుల ప్రతిమతో ఈ ఏడాది తొలి గణపతి నిమజ్జనం పూర్తి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 Sept 2026 6:39 PM IST
LB Nagar
X

LB Nagar: సరూర్‌నగర్ చెరువులో వైభవంగా తొలి గణపతి నిమజ్జనం

ఎల్బీనగర్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సరూర్‌నగర్ చెరువులో ఈ ఏడాది తొలి గణపతి నిమజ్జనం సోమవారం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.

కొత్తపేటకు చెందిన సతీష్ దంపతులు తమ ఇంటి వద్ద ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని సరూర్‌నగర్ చెరువులో ఈ ఏడాది తొలి గణపతిగా నిమజ్జనం చేశారు.

నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. అనంతరం గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా భక్తులు ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది త్వరగా రా’ అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలి నిమజ్జనంతో సరూర్‌నగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాల సందడి ప్రారంభమైంది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR