LB Nagar: కొత్తపేటలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!
LB Nagar: కొత్తపేట డివిజన్‌లో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. పర్యావరణ పరిరక్షణతో పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చిన మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్.
LB Nagar: కొత్తపేటలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!
LB Nagar: వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో కొత్తపేట డివిజన్‌లో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం కొత్తపేట డివిజన్ పరిధిలోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరై భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవాలి
ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. వినాయక చతుర్థి కేవలం ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదని, ప్రకృతి పరిరక్షణ సందేశాన్ని కూడా అందించే పర్వదినమని అన్నారు. అందరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని కోరారు.
రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మట్టి వినాయకులను వినియోగించడం ద్వారా భక్తిని చాటుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూనే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులకు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్లు ప్రేమ్, శివ, కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అధ్యక్షుడు అంజయ్య, బీజేపీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సభ్యులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.




