LB Nagar: ఎల్బీనగర్‌లో ధర్మ రక్షణ సభ కరపత్రాల ఆవిష్కరణ!

LB Nagar: స్వదేశం, స్వధర్మం పరిరక్షణ లక్ష్యంగా ఎల్బీనగర్ చింతలకుంటలో నిర్వహించనున్న ధర్మ రక్షణ సభ కరపత్రాల ఆవిష్కరణ వివరాలు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 Aug 2026 2:04 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్‌లో ధర్మ రక్షణ సభ కరపత్రాల ఆవిష్కరణ!

LB Nagar: స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 29న శనివారం సాయంత్రం 4 గంటలకు చింతలకుంటలోని ప్రలవి గార్డెన్‌లో నిర్వహించనున్న ధర్మ రక్షణ సభకు సంబంధించిన కరపత్రాలను వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి పాల్గొని,కరపత్రాలను ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ధర్మ రక్షణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సామూహిక ఉత్సవాల ద్వారా హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ, సామాజిక సమరసతను చాటేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.

కార్యక్రమంలో ఎల్‌.బి.నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, ప్రదీప్ రెడ్డి, నవీన్, వెంకన్న, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందచారి, మహిళా అధ్యక్షురాలు పార్వతి, నాయకులు శ్రీధర్ రెడ్డి, మహిళా నాయకులు పార్వతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

“వందేమాతరం 150 సంవత్సరాల స్ఫూర్తిని ఎలుగెత్తి చాటుదాం.. స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షణ కోసం ముందుకు సాగుదాం.. ధర్మ రక్షణ సభను విజయవంతం చేద్దాం” అని పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story