LB Nagar: భారీ వర్షాల అలర్ట్.. రహదారులపై పోలీసుల ప్రత్యేక నిఘా

LB Nagar: హైదరాబాద్‌ లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఎల్‌బీ నగర్ డీసీపీ అనురాధ ఐపీఎస్ రంగంలోకి దిగారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 15 Jun 2026 8:59 PM IST
LB Nagar
X

LB Nagar: భారీ వర్షాల అలర్ట్.. రహదారులపై పోలీసుల ప్రత్యేక నిఘా

LB Nagar: ఎల్బీనగర్ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నేడు ఎల్‌బీ నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన నీరు నిలిచే ప్రాంతాలను ఎల్‌బీ నగర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మరియు జీహెచ్‌ఎంసీ అధికారులతో ఎల్బి నగర్ డీసీపీ అనురాధ ఐపిఎస్ కలిసి పరిశీలించారు.

ప్రజల భద్రత కోసం చేపట్టిన నివారణ చర్యలు, ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు. స్థానిక పోలీసులకు సమస్యాత్మక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, నీరు నిల్వ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని ఆదేశించారు.

వర్షాల సమయంలో ప్రజలు నీరు నిలిచిన రహదారులను వీలైనంత వరకు నివారించి, తగిన జాగ్రత్తలు పాటించగలరు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story