LB Nagar: ఎల్బీనగర్‌లో ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన సంబరాలు

LB Nagar: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సంబరాలు ఘనంగా జరిగాయి. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోందని నాయకులు తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 Sept 2026 4:33 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్‌లో ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన సంబరాలు

ఎల్బీనగర్‌: కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎల్బీనగర్‌ కూడలిలో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. లింగోజిగూడ మాజీ కార్పొరేటర్‌ ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కుటుంబ పాలన, గడీల పాలన కొనసాగిందని విమర్శించారు. కుమారుడు, కూతురు, అల్లుడికి కీలక పదవులు కట్టబెట్టి అధికారాన్ని కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రాధాన్యమిస్తూ ప్రజాపాలన సాగిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై, సంక్షేమ పథకాలు అమలు దిశగా ముందుకెళ్తున్న ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నట్లు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రానున్న గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story