LB Nagar: 4 నిమిషాల్లో స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన పోలీసులు
LB Nagar: మూసీ నదిలో దూకబోయిన మహిళ, ముగ్గురు పిల్లలను కాపాడిన చైతన్యపురి పోలీసులు. 4 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరిన పెట్రోల్ మొబైల్ సిబ్బందికి అభినందనలు.
LB Nagar: 4 నిమిషాల్లో స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన పోలీసులు
ఎల్బీనగర్: ఎల్బీనగర్ ...డయల్-100కు వచ్చిన అత్యవసర సమాచారంపై చైతన్యపురి పోలీసులు అసాధారణ వేగంతో స్పందించి నలుగురి ప్రాణాలను కాపాడారు. సమాచారం అందిన కేవలం నాలుగు నిమిషాల్లోనే చైతన్యపురి పెట్రోల్ మొబైల్-1 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ముసీ నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళతో పాటు ఆమె ముగ్గురు చిన్నారులను డబ్ల్యూపీసీ ఎం. చంద్రకళ, హోంగార్డ్ జె. బాలరాజు హైడ్రా బృందం సహాయంతో సురక్షితంగా రక్షించారు. అనంతరం వారిని ఒడ్డుకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అత్యవసర పరిస్థితిలో సమయస్ఫూర్తితో వ్యవహరించి నాలుగు ప్రాణాలను కాపాడిన చైతన్యపురి పెట్రోల్ మొబైల్-1 పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అభినందించారు. వారి వేగవంతమైన స్పందనతో ఒక కుటుంబంలో విషాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.




