LB Nagar: దివ్యాంగుల హక్కుల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 'సమర శంఖారావం'

LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల సాధన కోసం సమర శంఖారావం సభ నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 Aug 2026 5:32 PM IST
LB Nagar
X

LB Nagar: దివ్యాంగుల హక్కుల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 'సమర శంఖారావం'

ఎల్బీనగర్: నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, దివ్యాంగుల హక్కుల సాధన కోసం “సమర శంఖారావం” సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు హరీశ్ రావు గారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు, సబితా ఇంద్రా రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తారు.

దివ్యాంగులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం…

ఎన్నికల ముందు దివ్యాంగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా దివ్యాంగులను మోసం చేసింది. రూ.6,000 దివ్యాంగుల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? అని నాయకులు ప్రశ్నించారు.

కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రూ.500గా ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను రూ.4,016కు పెంచింది. దివ్యాంగుల రిజర్వేషన్లను పెంచింది. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేసి, వారి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హామీలు ఇవ్వడంలో ముందుండి, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది.

రాష్ట్రంలోని 5 లక్షలకుపైగా ఉన్న దివ్యాంగులకు పెన్షన్ బకాయిలు పేరుకుపోయినా, వాటిని చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు మండిపడ్డారు. దివ్యాంగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం!

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. పెన్షన్ బకాయిలను తక్షణమే చెల్లించాలి. రూ.6,000 దివ్యాంగుల పెన్షన్ హామీని నెరవేర్చాలి. దివ్యాంగుల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడాలి.

దివ్యాంగుల హక్కుల సాధన కోసం పోరాటం ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు, దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు ఈ సమర శంఖారావం కొనసాగుతూనే ఉంటుంది అని నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story