LB Nagar: సిరినగర్ కాలనీలో అజాద్ యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు
LB Nagar: ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. 26 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం, 10 వేల మందికి అన్నదానం ఏర్పాటు చేసిన అజాద్ యూత్.
LB Nagar: సిరినగర్ కాలనీలో అజాద్ యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు
ఎల్బీనగర్: సిరినగర్ కాలనీలో అజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అజాద్ యూత్ సభ్యులతో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.
అజాద్ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గత 26 ఏళ్లుగా సిరినగర్ కాలనీలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ గణనాథుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో మంటపం వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గత 26 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నామని, దాదాపు 10 వేల మందికి పైగా భక్తులకు అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, అన్నదానం, దర్శనం తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అజాద్ యూత్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో కుంచెం ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, మల్లికార్జున్, రఘు,ప్రశాంత్, వినోద్,తీగల సురేష్, రిషీ, రితిష్, కిరణ్,శ్రీనివాస్, రఘు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు




