LB Nagar: ఏసీపీ ఆఫీసులో కానిస్టేబుల్ సాయికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య!

LB Nagar: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ రెస్ట్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 12 Aug 2026 7:44 AM IST
LB Nagar
X

LB Nagar: ఏసీపీ ఆఫీసులో కానిస్టేబుల్ సాయికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య!

LB Nagar: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ (PC 13128) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

సాయికుమార్ గత నెల నుంచి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం డీఎస్ఆర్‌కు సంబంధించి డీసీపీ కార్యాలయ సిబ్బంది ఏసీపీ కార్యాలయానికి ఫోన్ చేయగా స్పందన రాలేదు.

దీంతో డీసీపీ కార్యాలయ సిబ్బంది కింద ఉన్న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి.. ఏసీపీ కార్యాలయం నుంచి ఎవరూ స్పందించడం లేదని, డీఎస్ఆర్ కూడా రాలేదని, ఒకసారి వెళ్లి చూడాలని సూచించారు.

ఈ క్రమంలో సెక్షన్ ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ తెల్లవారు జామున సుమారు 2.30 గంటలకు ఏసీపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించగా, రెస్ట్‌రూమ్‌లో కానిస్టేబుల్ సాయికుమార్ ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సాయికుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story