Rangareddy: రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోండి: కాసు శ్రీనివాస్ రెడ్డి!

Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో సబ్సిడీ స్ప్రింక్లర్ల దరఖాస్తుకు నేటితో గడువు ముగింపు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 31 July 2026 5:36 PM IST
Rangareddy
X

Rangareddy: రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోండి: కాసు శ్రీనివాస్ రెడ్డి!

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వివిధ గ్రామాల రైతులకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్న స్ప్రింక్లర్ల పథకానికి దరఖాస్తుల గడువు నేటి (జూలై 31)తో ముగియనున్నందున అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి కోరారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో తలకొండపల్లి మండల రైతుల కోసం ప్రభుత్వం 100 స్ప్రింక్లర్లను మంజూరు చేసిందని తెలిపారు. రైతులు కేవలం రూ.9000 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)తో పాటు అవసరమైన పత్రాలను జత చేసి దరఖాస్తు సమర్పించాలని సూచించారు. వ్యవసాయంలో నీటి వినియోగాన్ని తగ్గిస్తూ పంటలకు సమర్థవంతంగా సాగునీరు అందించడంలో స్ప్రింక్లర్ విధానం ఎంతో ఉపయోగకరమని, దీనివల్ల మెరుగైన దిగుబడులు సాధించవచ్చని కాసు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సబ్సిడీ అవకాశాన్ని ప్రతి అర్హ రైతు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటితో గడువు ముగియనున్నందున ఇక ఆలస్యం చేయకుండా సంబంధిత వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడువు అనంతరం దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉండదని, ఈ అవకాశాన్ని ఏ రైతూ కోల్పోవద్దని సూచించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story