Kushaiguda: కుషాయిగూడలో నీటి ఎద్దడి నివారణకు స్వంత నిధులతో బోరు
Kushaiguda: కుషాయిగూడలో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజల ఇబ్బందులు గమనించి, తన స్వంత నిధులతో చేయి పంపు బోరింగ్ ఏర్పాటు చేసిన వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చక్రపాణి గౌడ్.
Kushaiguda: కుషాయిగూడలో నీటి ఎద్దడి నివారణకు స్వంత నిధులతో బోరు
కుషాయిగూడ: కుషాయిగూడ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా ప్రజలు కనీస అవసరాలకు కూడా నీరు లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే . ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లభించకపోవడంతో, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సామాజిక కార్యకర్త పనగట్ల చక్రపాణి గౌడ్ తన స్వంత నిధులతో చేయి పంపు బోరింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా పనగట్ల చక్రపాణి గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను, అలాగే ఎవరైనా మరణించిన సమయంలో కూడా నీటి కోసం పడుతున్న అవస్థలను నేను దెగ్గర నుండి చూసానాని అందుకే సామాజిక బాధ్యతగా ఈ చేయి పంపు బోరింగ్‌ను ప్రజలకు కనీస అవసరాల కోసం వారికి అందుబాటులోకి తీసుకరావడం జరిగింది అని వారు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేను అలాగే కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని, ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాగుల వాసుదేవ ముదిరాజ్, చల్లా ప్రభాకర్, కొడకండ్ల యాదయ్య, సల్ల వెంకటేష్, పండాల గణేష్ గౌడ్, నాలచెరువుల జనార్దన్, పిట్ల రాజు ముదిరాజ్, అంజన్న, G కృష్ణ కుమార్, అనిల్ యాదవ్, లడ్డు, నిరుడు బాబు, క్యాత దినేష్, నేమూరి సాయి గౌడ్, లవణం శ్రీనివాస్, స్థానిక పెద్దలు యాదగిరి, బాలరాజు, శివకుమార్, హనుమంత్ , వెంకటేష్, బాలకృష్ణ, స్థానిక మహిళలు పాల్గొన్నారు.




