Kushaiguda: కుషాయిగూడ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఘనంగా ప్రసాద వితరణ!
Kushaiguda: హైదరాబాద్ కుషాయిగూడలోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో అమావాస్య పురస్కరించుకుని విగ్రహ సమితి ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార ప్రసాద వితరణ జరిగింది.
Kushaiguda: కుషాయిగూడ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఘనంగా ప్రసాద వితరణ!
Kushaiguda: కుషాయిగూడలోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ప్రతి అమావాస్య రోజు నిర్వహించే అల్పాహార ప్రసాద వితరణ కార్యక్రమం సోమవారం హనుమాన్ విగ్రహ సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కార్యసిద్ధి హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ గర్భగుడిలో నవ హనుమాన్ మూర్తులతో పాటు శ్రీరామాయణంలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించే సన్నివేశాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి, ఆలయ నిర్మాణానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి, విరాళాల ద్వారా చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చల్లా ప్రభాకర్, యావపురం రవి, పనగట్ల చక్రపాణి గౌడ్, పిట్టల రాజు, పాండాల గణేష్ గౌడ్, చల్ల వెంకటేష్, అనిల్ యాదవ్, చల్ల లక్ష్మణ్, నాలచెరువుల జనార్ధన్, హరి నాయక్, బాబు గౌడ్, బాలకృష్ణ, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




