Kukatpally: ఎంఎస్‌ఎంఈ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Kukatpally: MSME చట్ట సవరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన సందర్భంగా బాలానగర్‌ MSME కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ శివ శేషగిరి రావు మీడియా సమావేశం.

Maruthisagar, Kukatpally
Published on: 11 Aug 2026 5:02 PM IST
Kukatpally
X

Kukatpally: ఎంఎస్‌ఎంఈ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కూకట్ పల్లి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి చట్టం–2026 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బాలానగర్‌లోని MSME కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా MSME-DFO జాయింట్ డైరెక్టర్ సి. శివ శేషగిరి రావు మాట్లాడుతూ.. 20 ఏళ్ల తర్వాత చేపట్టిన చట్ట సవరణలతో MSMEలకు చట్టపరమైన భరోసా, వ్యాపార సౌలభ్యం, సమస్యల త్వరిత పరిష్కారానికి అవకాశం కలుగుతుందని తెలిపారు.

సవరించిన చట్టంలో పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా MSMEల వర్గీకరణను చట్టబద్ధం చేయడంతో పాటు, ఉచితంగా నమోదు చేసుకునేందుకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన MSMEలు గత మూడేళ్లలో 1.65 కోట్ల నుంచి 9.16 కోట్లకు పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ రంగం 40 కోట్లకు పైగా మందికి ఉపాధి కల్పిస్తోందని శివ శేషగిరి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story