Kukatpally: కేపీహెచ్బీలో ఘనంగా సీనియర్ సిటిజన్స్ యోగా డే వేడుకలు
Kukatpally: కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ 3వ ఫేజ్ సీనియర్ సిటిజన్స్ భవనంలో యోగా డే వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
Kukatpally: కేపీహెచ్బీలో ఘనంగా సీనియర్ సిటిజన్స్ యోగా డే వేడుకలు
కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం KPHB 3వ ఫేజ్‌లోని సీనియర్ సిటిజన్స్ భవనంలో నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ యోగా డే వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యోగా గురువులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన సీనియర్ సిటిజన్స్‌ను సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. పెద్దలు తమ అనుభవంతో అందించే సూచనలు, సందేశాలను గౌరవించి జీవితంలో ఆచరిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు.
వయసు పెరిగినప్పటికీ యోగా, ధ్యానం చేస్తూ తమ పనులను తామే చేసుకుంటున్న సీనియర్ సిటిజన్స్ నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, క్రమశిక్షణ వంటి అంశాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, యోగా గురువులు, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.




