Kukatpally: డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు!
Kukatpally: కూకట్‌పల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.
Kukatpally: డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు!
Kukatpally: డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడుతోందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఖైతలాపూర్‌లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 145 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నాలా పక్కన నివసిస్తున్న అమృత్‌నగర్ తండా నిరుపేదలకు కేటాయించాలని తాము డిమాండ్ చేసినప్పటికీ, అర్హులను పక్కనబెట్టి మంత్రులు, కలెక్టర్లు, అధికారుల సిఫార్సులతో ఇతరులకు ఇళ్లు కేటాయిస్తున్నారని విమర్శించారు.
నిరుపేదలు, విలేకరులకు ఇళ్లు కేటాయించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. హౌసింగ్ బోర్డు వీసీ, హైదరాబాద్–రంగారెడ్డి కలెక్టర్, ఎండోమెంట్స్ కమిషనర్ సిఫార్సులతో పాటు కుత్బుల్లాపూర్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి, ఖమ్మంలో నివసిస్తున్న మహిళ, పలువురు రాజకీయ నాయకుల సిఫార్సు చేసిన వ్యక్తులకు కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో కనీస నిబంధనలు పాటించడం లేదని, దరఖాస్తులు చేయని వ్యక్తులకు కూడా సిఫార్సు లేఖల ఆధారంగా ఇళ్లు కేటాయిస్తున్నారని అన్న.




