Kukatpally: కూకట్‌పల్లి ఓమ్ని ఆసుపత్రి డిశ్చార్జ్ సమ్మరీలో నిర్లక్ష్యం

Kukatpally: కూకట్‌పల్లి ఓమ్ని ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ రోగి డిశ్చార్జ్ సమ్మరీలో కాళ్లకు ఫ్రాక్చర్లు అని నమోదు. బాధితుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ.

MARUTI SAGAR, KUKATPALLY
Published on: 19 Aug 2026 6:29 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లి ఓమ్ని ఆసుపత్రి డిశ్చార్జ్ సమ్మరీలో నిర్లక్ష్యం

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి ఓమ్ని ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ కోసం చేరిన వ్యక్తి కాళ్లకు ఫ్రాక్చర్లు అయినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో పేర్కొన్న ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెయిన్ సర్జరీ కోసం ఓమ్ని ఆసుపత్రిలో చేరగా, కేవలం బ్రెయిన్ సర్జరీ మాత్రమే చేయాలని వైద్యులు సూచించడంతో చికిత్స చేయించుకున్నారు. సర్జరీ అనంతరం ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీలో కాళ్లకు ఫ్రాక్చర్లు అయినట్లు పేర్కొన్నారని, ఆసుపత్రిలో చేరే సమయంలో కాళ్లకు ఎలాంటి ఫ్రాక్చర్లు లేవని బాధితులు ఆరోపించారు.

ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమస్యను సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

MARUTI SAGAR, KUKATPALLY

MARUTI SAGAR, KUKATPALLY

Next Story