Kukatpally: జైపాల్ రెడ్డి వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన బండి రమేష్

Kukatpally: మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బాలానగర్‌లో ఘనంగా నివాళులు. పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి ఇన్‌చార్జి బండి రమేష్.

Maruthisagar, Kukatpally
Published on: 28 July 2026 8:56 PM IST
Kukatpally
X

Kukatpally: జైపాల్ రెడ్డి వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన బండి రమేష్

కూకట్‌పల్లి: మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా బాలానగర్‌లోని వెంకటేశ్వర్ నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన ప్రజాసేవ, రాజకీయ విలువలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, తూము సంతోష్, పులి శివగౌడ్, చంద్ర, నాగార్జున, క్రాంతి, నర్సింగ్, రాము, రమణ, జ్యోతి, శ్రీనివాస్, పార్వతి, ముస్తఫా తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జైపాల్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story