Kukatpally: రాజీవ్ గాంధీ నగర్‌లో కరెంట్ పోల్ వివాదం.. అధికారులపై ఆరోపణలు!
Kukatpally: ఐడీపీఎల్ రాజీవ్ గాంధీ నగర్‌లో విద్యుత్ స్తంభం మార్పిడిపై స్థానికుల అభ్యంతరం. విద్యుత్ అధికారుల వసూళ్లపై ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్.
Kukatpally: రాజీవ్ గాంధీ నగర్‌లో కరెంట్ పోల్ వివాదం.. అధికారులపై ఆరోపణలు!
కూకట్ పల్లి: బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని ఐడీపీఎల్ విద్యుత్ సెక్షన్‌లోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభం తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఒక చోటు నుంచి మరోచోటికి తరలించేందుకు సంబంధిత వ్యక్తి నుంచి విద్యుత్ శాఖ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని కాలనీవాసులు ఆరోపించారు.
విద్యుత్ స్తంభం తరలింపు పనులు జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పనులకు విద్యుత్ శాఖ నుంచి అధికారిక అనుమతులు తీసుకున్నారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
విద్యుత్ స్తంభం తరలింపుకు సంబంధించిన అనుమతులు, చెల్లింపుల వివరాలు బహిర్గతం చేయాలని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కాలనీవాసులు కోరుతున్నారు.




