Hyderabad: ప్రభుత్వానివి చిల్లర డ్రామాలు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

Hyderabad: ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్ చిల్లర డ్రామాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Sept 2026 12:42 PM IST
Hyderabad
X

Hyderabad: ప్రభుత్వానివి చిల్లర డ్రామాలు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

Hyderabad: ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పక్షం చిల్లర డ్రామాలు చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారంపై మండలలిలో సమగ్ర చర్చ జరగాలనన్నారు.

సీఎం బెదిరింపులకు ఎవరూ భయపడే ప్రసక్తి లేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేయించారని కేటీఆర్ ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 420 హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story