Khajaguda: ఖాజాగూడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన సేవా కార్యక్రమాలు
Khajaguda: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఖాజాగూడలో కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమం నిర్వహించారు.
Khajaguda: ఖాజాగూడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన సేవా కార్యక్రమాలు
Khajaguda: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌ॥ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఖాజాగూడలో "Gift a Smile" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు & మాజీ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారి ఆధ్వర్యంలో కొమిరిశెట్టి ఫౌండేషన్ తరపున గచ్చిబౌలి డివిజన్ లోని 12 అంగన్‌వాడీ సెంటర్లకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు.
"Gift a Smile - Present for a Better Future" పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ పిల్లలకు, సిబ్బందికి ఉపయోగపడే సామాగ్రిని అందించడం జరిగింది.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన అందరికీ కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు ధన్యవాదాలు తెలియజేసారు.




