LB Nagar: ఎల్.బి.నగర్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. కార్యకర్తలకు ఇచ్చిన టాస్క్ ఇదే!

LB Nagar: ఎల్.బి.నగర్ హస్తినాపురంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఎల్.ఏ (BLA) శిక్షణ కార్యక్రమం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 18 May 2026 7:41 AM IST
LB Nagar
X

LB Nagar: ఎల్.బి.నగర్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. కార్యకర్తలకు ఇచ్చిన టాస్క్ ఇదే!

LB Nagar: ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం డివిజన్‌లో గల జి.ఎస్.ఆర్ హాల్‌లో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఎల్.ఏ. (BLA) ల శిక్షణ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.రామారావు (కేటీఆర్) గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతం మరియు ఓటరు జాబితా పరిరక్షణలో BLAల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. బి.ఎల్.ఏల ప్రధాన బాధ్యతల్లో భాగంగా ఓటరు జాబితాను పరిశీలించడం, కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టడం, తప్పులు మరియు డూప్లికేట్ పేర్లను గుర్తించడం, ఓటర్ల వివరాలను సరిచేయించేందుకు సహకరించడం, ఎన్నికల కమిషన్ నిర్వహించే ప్రత్యేక సర్వేలు మరియు రివిజన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో నిర్వహిస్తున్న “BLA శిక్షణ” అనేది బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలకు ఓటరు జాబితా నిర్వహణపై అవగాహన కల్పించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమమని తెలిపారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించి, ప్రతి అర్హుడైన ఓటరుకు న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు,మహ్మద్ అలీ,ఎమ్మెల్యేలు బండారు లక్ష్మరెడ్డి, ముఠా గోపాల్,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు,దేశపతి శ్రీనివాస్ గారు,దేవిప్రసాద్,గోలి శ్రీనివాస్ రెడ్డి,పల్లె రవికుమార్,ఎల్.బి.నగర్ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, వివిధ విభాగాల కమిటీ మాజీ చైర్మన్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, పలు విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story