Shabad: షాబాద్ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు!

Shabad: షాబాద్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 4 Sept 2026 5:54 PM IST
Shabad
X

Shabad: షాబాద్ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు!

Shabad: షాబాద్ మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జన్మాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీకృష్ణుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం భక్తులు భజనలు చేస్తూ శ్రీకృష్ణుని నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.

ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మణెమ్మ, గ్రామస్థులు లంబడి కిరణ్ , తమ్మలి గౌతమ్, రవీందర్, నారాయణ, సత్యం, వినయ్, శివ, వసంత్, ఆకాష్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story