Kukatpally: కేపీహెచ్బీలో గంజాయి కలకలం ముగ్గురి అరెస్ట్!
Kukatpally: కేపీహెచ్బీ పరిధిలోని హాస్టల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి, 7.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Kukatpally: కేపీహెచ్బీలో గంజాయి కలకలం ముగ్గురి అరెస్ట్!
Kukatpally: కూకట్ పల్లి, మారుతిసాగర్, రిపోర్టర్ : కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఓటీ కుత్బుల్లాపూర్ బృందం అరెస్ట్ చేశారు. రోడ్ నెం.2లోని ఓ హాస్టల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో గోపిరెడ్డి గౌతంరెడ్డి, శివ నాగిరెడ్డి, కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని సరఫరా చేస్తున్న సందీప్ అనే వ్యక్తి ఒడిశాకు చెందినవాడిగా గుర్తించగా, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 7.50 కిలోల ఎండు గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని కెపిహెచ్బి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story




