Hyderabad: కేపీహెచ్‌బీ పరిధిలో యువతి అదృశ్యం.. కేసు నమోదు

Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలోని ఆదిత్యనగర్‌లో 21 ఏళ్ల యువతి అదృశ్యం. ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సోమాల బన్ను. పోలీసుల దర్యాప్తు.

Maruthisagar, Kukatpally
Published on: 12 Aug 2026 5:39 PM IST
Hyderabad
X

Hyderabad: కేపీహెచ్‌బీ పరిధిలో యువతి అదృశ్యం.. కేసు నమోదు

హైద్రాబాద్: కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆదిత్యనగర్‌లో 21 ఏళ్ల యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా బట్లపల్లి మండలం వెలటూరు గ్రామానికి చెందిన సోమాల బన్ను భర్త వేధింపులు భరించలేక పది రోజులుగా హైదరాబాద్‌లోని తల్లి వద్ద ఉంటోంది.

ఆగస్టు 11న సాయంత్రం 7.30 గంటలకు ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు.

సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లినట్టు తల్లి ఫిర్యాదులు పేర్కొంది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కెపిహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story