Kondapur: కొండాపూర్ ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై పీఏసీ చైర్మన్ గాంధీ సమీక్ష!

Kondapur: కొండాపూర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రూ.40.50 కోట్ల క్రిటికల్ కేర్ పనులను పరిశీలించారు. పూర్తి వివరాలు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 25 Aug 2026 9:46 PM IST
Kondapur
X

Kondapur: కొండాపూర్ ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై పీఏసీ చైర్మన్ గాంధీ సమీక్ష!

కొండాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ జిల్లా ఆసుపత్రికి సంబంధించిన 'ఆసుపత్రి అభివృద్ధి కమిటీ' (HDS) సమావేశం లో గౌరవ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీమతి కిరణ్మయి (IAS), గారు , గౌరవ DMHO డాక్టర్ స్వర్ణకుమారి గారు, ఇన్‌ఛార్జ్ DCHS డాక్టర్ సుధాకర్ బండారి గారు, ఇన్‌ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ చంద్రకృష్ణ గారు మరియు ఇతర కమిటీ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తో కలిసి పాల్గొన్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ కొండాపూర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని, ప్రజా ఆరోగ్యమే పరమావధిగా డాక్టర్లు సేవలు అందించాలని, డాక్టర్లు కనిపించే దేవుళ్లతో సమానం అని, పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రజలకు మంచి నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల నుండి మన్ననలు పొందాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.

కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని బలోపేతం చేయడం మరియు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం పట్ల ప్రతి ఒకరు నిబద్ధత తో పనిచేయాలని, కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా కొండాపూర్ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగినది అని, కొండాపూర్ జిల్లా ఆసుపత్రి ని అన్ని రకాల మౌలిక వసతులతో, అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో ఆసుపత్రి ని తీర్చిదిద్దడం జరిగినది అని, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని, 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ భవనం పనులు కొనసాగుతున్నాయి అని, త్వరలోనే అందుబాటులోకి వస్తుంది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.

ఆసుపత్రి అభివృద్ధి మరియు నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర ఆసుపత్రి సేవలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ సమావేశం సానుకూల మరియు నిర్మాణాత్మక ఫలితాలను ఇచ్చింది అని,

విస్తృత చర్చల అనంతరం, డ్రైనేజీ, విద్యుత్ మరియు పారిశుధ్యం/శుభ్రతకు సంబంధించిన పలు తీర్మానాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

తీర్మానాలను త్వరితగతిన అమలు చేయడం, అలాగే ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మరియు రోగులకు అందించే సేవలను మరింత మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సభ్యులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.

కొండాపూర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఏ అవసరం ఉన్న, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.

కొండాపూర్ జిల్లా ఆసుపత్రి లో రూ. 40 కోట్ల 50 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించబోయే 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం భవనం నిర్మాణం పనులను పరిశీలించడం జరిగినది. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువాలని, పనులలో వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, భవనం నిర్మాణం పై అధికారులకు పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది.100 పడకల క్రిటికల్ కేర్ విభాగం అందుబాటులోకి వస్తె ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story