Qutubullapur: వినూత్నంగా పర్యావరణ ఉద్యమం.. మోదుగాకులో గణపతి పూజ!
Qutubullapur: ప్లాస్టిక్‌ను వ్యతిరేకిస్తూ మోదుగాకులతో విస్తరాకులు కుడుతూ, మోదుగాకు గణపతితో పర్యావరణ సందేశం చాటిన కుత్బుల్లాపూర్ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్.
Qutubullapur: వినూత్నంగా పర్యావరణ ఉద్యమం.. మోదుగాకులో గణపతి పూజ!
Qutubullapur: వినాయక చవితి సందర్భంగా సామాజిక పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ మోదుగా ఆకులు తో విస్తరాకులు కొడుతూ మనుమరాళ్లకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ కాపాడాలని మోదుగాకులో గణపతిని పెట్టి పూజ చేయాలని మనమరాళ్లకు చూపిస్తూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుటకై గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మోదుగాకులు కోసుకొని వచ్చి ఇస్తరాకులు కుట్టుకున్నట్టయితే మనం ప్లాస్టిక్ ఇస్తరాకులను దూరం చేసినట్టు ప్లాస్టిక్ విస్తరాకులలో భోజనం తింటే ప్రమాదకరమని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు.
క్యాన్సర్ వస్తుందని వాటిని తిన్న పశువులకు ఆరోగ్యం చెడిపోతుందని భూమాత జలమాత గోమాత చెడిపోతూ మానవుల ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ఇస్తరాకులు వీడనాడండి స్వచ్ఛమైన ఆకుతో కుట్టిన లేదా అరిటాకులో స్టీల్ ప్ల్ ట్ లో భోజనం చేయండి అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ఉచితంగా వినాయక ప్రతిమలు,వాటితో పాటు వారికి ఇస్తరాకులు అందజేశారు.
విద్యార్థులచే ప్లాస్టిక్ కవర్లు వాడమని వినాయకులను మట్టిలో కరిగించి చెట్లకు వేస్తామని భవిష్యత్తులో నీటిని పొదుపుగా వాడతామని వారిచే ప్రమాణం చేస్తూ మార్కెట్ కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కూరగాయలు పళ్ళు చేయి సంచులు తెచ్చే విధంగా మా అమ్మ నాన్నకు అవగాహన కల్పిస్తామని రవీందర్ అన్నకుమాటిస్తున్నామని అన్నారు.
దీన్ని చూసిన కాలనీ ప్రజలు ప్లాస్టిక్ ను విడనాడితే బాగుంటుందని ఇలాంటివారు ఒక పదిమంది ఉంటే పర్యావరణాన్ని కాపుడొచ్చని అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నాణ్యతలేని ప్లాస్టిక్ కవర్లు ఇస్తరాకులు తయారీ చోటనే పరిశ్రమనే మూసివేస్తే ఈ నాణ్యతలేని ప్లాస్టిక్ మార్కెట్లోకి రాదు కదా అని అనుకున్నారు.




