Tandur: తాండూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉప్పరి రమేష్ ప్రమాణస్వీకారం!

Tandur: తాండూరు అడ్డాలో బీజేపీ జెండా ఎగరేయాలి: ఉప్పరి రమేష్ ప్రమాణ స్వీకారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు, కార్యకర్తలకు పిలుపు.

Srikanth Reddy, Tandur
Published on: 31 Aug 2026 12:32 PM IST
Tandur
X

Tandur: తాండూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉప్పరి రమేష్ ప్రమాణస్వీకారం!

Tandur: తాండూరులో బీజేపీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో తాండూరు అడ్డాలో బీజేపీ జెండా ఎగరేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాండూరులో జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉప్పరి రమేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) పార్టీలు రెండూ దొందూ దొందేనని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంపై సరైన అవగాహన లేదని అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కంటే కమిషన్లకు కక్కుర్తి పడుతోందని విమర్శించారు. దేశంలో బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేసిన ఘనత బీజేపీదేనని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీని తాండూరులో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story