Khairatabad: ఖైరతాబాద్‌లో తాగునీరు, సీవరేజ్ సమస్యలు పరిష్కరించాలి MGR!

Khairatabad: జలమండలి సీజీఎంను కలిసిన బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR). నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనేజీ సమస్యల తక్షణ పరిష్కారానికి వినతి.

RAJESH,	WEST ZONE
Published on: 29 Aug 2026 6:52 PM IST
Khairatabad
X

Khairatabad: ఖైరతాబాద్‌లో తాగునీరు, సీవరేజ్ సమస్యలు పరిష్కరించాలి MGR!

Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత కొన్ని నెలలుగా నెలకొన్న తాగునీరు, సీవరేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో HMWS&SB ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మరియు CGM ప్రభు గారిని కలిసిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు వినతి పత్రం ద్వారా సమస్యలను తెలిపారు .

ఈ సందర్భంగా MGR గారు మాట్లాడుతూ..

నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సీవరేజ్ సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా GHMC కమిటీ హాల్ నుంచి శ్రీనివాస నగర్ నుండి BJR నగర్ వరకు, ఆంధ్ర గల్లీ, న్యూ CBI క్వార్టర్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సీవరేజ్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, మురుగు నీరు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని CGM ప్రభు గారిని MGR గారు కోరారు.

MGR గారి వినతిపై CGM ప్రభు గారు సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని MGR గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గజ్జల ఆనంద్ గారు, శ్యామ్ గౌడ్, బిట్ల శ్రీనివాస్, శ్రీనివాస్, షౌరిరాజ్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story