Serilingampally: శేర్లింగంపల్లిలో అంబరాన్నంటిన కట్ట మైసమ్మ బోనాలు
Serilingampally: శేర్లింగంపల్లి వెంకటేశ్వర నగర్ కట్ట మైసమ్మ బోనాల జాతరలో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Serilingampally: శేర్లింగంపల్లిలో అంబరాన్నంటిన కట్ట మైసమ్మ బోనాలు
కుత్బుల్లాపూర్
లష్కర్ బోనం కట్ట మైసమ్మ వైభవం
బొట్లబొట్ల బోనాలు.. డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు.. శేర్లింగంపల్లి లో వెంకటేశ్వర నగర్ కట్ట మైసమ్మ బోనాల జాతర సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే వెంకటేశ్వర నగర్ లోని కట్ట మైసమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తలపై బోనమెత్తుకొని.. మదిలో కట్ట మైసమ్మ ను తలచుకొని.. అడుగులో అడుగేస్తూ.. అమ్మను స్మరిస్తూ దివ్యమంగళ స్వరూపిణిగా కొలువుదీరిన జగజ్జననికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అమ్మవారికి వెంకటేశ్వర నగర్ కాలనీవాసులు పెద్ద ఎత్తున బోనలతో చేరుకున్నారు . రాజకీయ నేతలు, అధికారులు కట్ట మైసమ్మ ని దర్శించుకున్నారు. నిర్వాహకులు
ఎర్ర లక్ష్మయ్య, బాబు, రాంబాబు, బొమ్మ శ్రీధర్, బాలరాజు, తిమ్మయ, యాదగిరి, బీమ్, దుర్గాప్రసాద్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు




