Karan Kot: కరణ్‌కోట్‌లో పేకాట స్థావరంపై దాడి.. 8 మంది అరెస్ట్
Karan Kot: కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి. 8 మందిని అరెస్ట్ చేసి, రూ. 82,770 నగదు స్వాధీనం.
Karan Kot: కరణ్‌కోట్‌లో పేకాట స్థావరంపై దాడి.. 8 మంది అరెస్ట్
కరణ్ కోట్: కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా, పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా మాట్లాడుతూ....
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశానుసారం నమ్మదగిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ దాడిలో 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్దనుండి రూ.82,770 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం కరణ్ కోట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగిందన్నారు. పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.




