Hyderabad: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసిన కరీంనగర్ మేయర్

Hyderabad: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కరీంనగర్ మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 Jun 2026 4:46 PM IST
Hyderabad
X

Hyderabad: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసిన కరీంనగర్ మేయర్

కరీంనగర్: హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కోలగని శ్రీనివాస్. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని, మేయర్ పీఠాన్ని దక్కించుకున్నందుకు నితిన్ నబిన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సన్మానించారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు మంచి గుర్తింపు తీసుకువచ్చేలా, ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా పనిచేయాలని మేయర్ కు నితిన్ నబిన్ సూచించారు.

అలాగే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, బిజెపి రాష్ట్ర పరిశీలకులు సునీల్ బన్సల్ ను మేయర్ కొలగాని శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నగర కార్పొరేషన్ ను బిజెపి కైవసం చేసుకోవడం పట్ల సునీల్ బన్సల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేయర్ ను సునీల్ బన్సల్ అభినందించారు.ఈ సందర్భంగా

మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ

"పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ స్వయంగా అభినందించి సన్మానించడం తనకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని, వారి సూచనలను శిరసా వహిస్తామన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

ప్రస్తుతం స్మార్ట్ సిటీ, అర్బన్ డెవలప్మెంట్ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని , ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రతి డివిజన్ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతాం అని మేయర్ కోలగాని శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు , జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story