Kapra: పరిమళ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Kapra: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ పరిమళ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షుడిగా గణపతిరెడ్డి, కార్యదర్శిగా శివప్రసాద్ గౌడ్.
Kapra: పరిమళ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కాప్రా: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిమళ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆదివారం కాలనీ సంక్షేమ సంఘంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని కాలనీవాసులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా గణపతిరెడ్డి, ఉపాద్యక్షులుగా ఆనంద్ రాజ్ , గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా వినోద్ కుమార్, శ్రీకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శిగా నాగ మల్లేశ్వరరెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, కోశాధి గారి గా హేమంత కుమార్ గౌడ్ లను ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిధులు కాలనీవాసులందరితో కలిసి కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో తమను కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.




