Kapra: ఈసీఐఎల్, రాధిక వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టాలి పావని
Kapra: కాప్రా సర్కిల్ ఈసీఐఎల్, రాధిక చౌరస్తాల్లో పాదచారుల వంతెనలు నిర్మించాలని మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి వినతి.
Kapra: ఈసీఐఎల్, రాధిక వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టాలి పావని
కాప్రా: కాప్రా సర్కిల్ పరిధిలోని పలు డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిన ఐటి శాఖ మాత్యులు శ్రీధర్ బాబు ను సందర్భంగా కలిసి ఈసీఐఎల్ చౌరస్తా , రాధిక చౌరస్తాలో పాదచారుల వంతెన లేక రోడ్డు దాటేందుకు పాదచారూలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి గారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
అదేవిధంగా తనతో పాటు వివిధ కాలనీలకు చెందిన ప్రతినిధులతో కలసి వినతి పత్రాలను మంత్రి శ్రీధర్ బాబు కి అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పావని మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ రెండు వంతెనలనునిర్మించడానికి మంత్రి శ్రీధర్ బాబు సనుకూలంగా స్పందించారని కాప్రా సర్కిల్ పరిధిలో విరివిగా కొత్త కాలనీలు ఏర్పడుతూ ఈ రెండు చౌరస్తాలలో రద్దీ పెరుగుతుంధని దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కావున త్వరితగతిన ఈ రెండు చౌరస్తాలలో పాదచారుల వంతెనలను నిర్మించాలని మంత్రని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఇంచార్జ్ పరమేశ్వరరెడ్డి మాజీ కార్పొరేటర్లు శ్రీదేవి స్వర్ణరాజు శివమణి కాప్రా కాలనీ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ మధుకర్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




