Rangareddy: కందుకూరు మండలంలో భూ అక్రమ ఆక్రమణ కలకలం!
Rangareddy: తిమ్మపూర్ పరిధిలో బిక్షపతి గౌడ్ కు చెందిన 1 ఎకరం భూమిని అక్రమంగా ఆక్రమించగా, ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Rangareddy: కందుకూరు మండలంలో భూ అక్రమ ఆక్రమణ కలకలం!
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన తాలబిక్షపతి గౌడ్, S/O బాలరాజ్ గౌడ్ కుటుంబానికి తిమ్మపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 508, 509, 510, 511లో మొత్తం 6 ఎకరాల 13 గుంటల వ్యవసాయ భూమి ఉందని బాధితులు చెబుతున్నారు.
తమ భూమితో సంబంధం లేని కొందరు వ్యక్తులు సుమారు ఒక ఎకరం భూమిని అక్రమంగా ఆక్రమించి కడీలు పాతారని వారు ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా తమను, తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని బాధితులు అంటున్నారు.ఈ వ్యవహారంపై కందుకూరు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయం, మండల సర్వేయర్, అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు కనిపించలేదని వారు వాపోతున్నారు.
విచారణలో ఆలస్యం జరుగుతోందని, తమ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, భూమి వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.ఒకవైపు తమ భూమి అక్రమంగా ఆక్రమించబడిందని బాధితులు ఆరోపిస్తుండగా, మరోవైపు పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని కోరారు.




