Kadthal: జనసంద్రంగా మారిన సుంకిరెడ్డి ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

Kadthal: కడ్తాల్‌లో కొనసాగుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం. ఐదో రోజు భారీగా తరలివచ్చిన ప్రజలు, ప్రారంభమైన కంటి శుక్లాల ఆపరేషన్లు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 15 Sept 2026 6:24 PM IST
Kadthal
X

Kadthal: జనసంద్రంగా మారిన సుంకిరెడ్డి ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

కడ్తాల్‌: కడ్తాల్‌లోని M.B.A గార్డెన్స్‌లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో, శంకర నేత్రాలయ, చెన్నై కంటి వైద్య నిపుణులచే నిర్వహిస్తున్న సుంకిరెడ్డి 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఐదో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది.

ఐదో రోజు శిబిరానికి కడ్తాల్ మండలం, పరిసర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో M.B.A గార్డెన్స్ జనసంద్రంగా మారింది, ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి చేరుకుని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందించడంతో పాటు, కంటి శుక్లాల సమస్య ఉన్న పేషెంట్లను ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ..“కడ్తాల్‌లో నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి రోజురోజుకూ ప్రజల నుంచి స్పందన పెరుగుతోంది. ఐదో రోజు ఒక్కరోజే 1,200 మందికి పైగా ప్రజలు శిబిరాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉంది, వీరిలో.. 812 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, 500 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని, 25 మంది కంటి శుక్లాల పేషెంట్లను ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశామని తెలుపుతూ,

ఈరోజు నుండి ప్రారంభమైన కంటి శుక్లాల ఆపరేషన్ల ప్రక్రియ, మొదటి రోజు ఆపరేషన్ల కోసం 35 మందిని ఎంపిక చేయగా వారిలో 32 హాజరవ్వగా అందిరికీ విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి అయ్యాయని తెలిపుతూ, కంటి సమస్యలను చాలామంది ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు, ఆర్థిక పరిస్థితులు, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కొందరు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు,అలాంటి వారికి తమ ప్రాంతంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం.

అవసరమైన ప్రతి ఒక్కరికీ వైద్యుల సూచనల మేరకు తగిన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలి, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రోజువారీ కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.”

కంటి శుక్లాల ఆపరేషన్లు కొనసాగింపు..

సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు కంటి శుక్లాల ఆపరేషన్లకు ఎంపికైన పేషెంట్లకు వైద్యుల సూచనల మేరకు విడతల వారీగా ఉచిత ఆపరేషన్లు నిర్వహించనున్నారు. అలాగే రేపటితో కంటి పరీక్షల ప్రక్రియ ముగియనుందని,

కడ్తాల్ మండలం, పరిసర గ్రామాల ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిబిరానికి హాజరై ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో.. సర్పంచ్ లు పాలకుర్ల మహేందర్ గౌడ్, పాలకుర్ల కరుణాకర్ గౌడ్, రవికుమార్, పొగాకు సంధ్య రాణి వెంకటేష్, రామచందర్ నాయక్, స్థానిక వార్డు సబ్యులు నాగరాజు,

ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తల్లోజు రఘు, ఎగిరిశెట్టి లింగం, రచ్చ శ్రీరాములు , నరేందర్ గౌడ్, జగన్, చంద్ర శేఖర్, కొండల్ యాదవ్,రమేష్ యాదవ్, శ్రీపతి,శేఖర్, మల్లేష్ నాయక్,శ్రీను, భాస్కర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY