Kadthal: కడ్తాల్లో హైటెన్షన్ వైర్ల బాధితులు ఎమ్మెల్యే కసిరెడ్డికి వినతి!
Kadthal: కడ్తాల్ మీదుగా వెళ్తున్న 765 KV హైటెన్షన్ లైన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం.
Kadthal: కడ్తాల్లో హైటెన్షన్ వైర్ల బాధితులు ఎమ్మెల్యే కసిరెడ్డికి వినతి!
Kadthal: కడ్తాల్ పట్టణం మీదుగా వెళ్తున్న 765 KV హై టెన్షన్ లైన్ వల్ల నష్టపోయిన రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిక్షపతి , ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి నరసింహ ముదిరాజ్ నారాయణ తదితరులు ఎమ్మెల్యే కలిశారు.
హై టెన్షన్ లైన్ ఏర్పాటు కారణంగా పంటలు, భూమి నష్టపోయిన రైతుల వివరాలను ఎమ్మెల్యే వివరించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయమైన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




