Kadtal: కడ్తాల్‌లో 2,000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ!
Kadtal: కడ్తాల్‌లో గంప లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 2000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గంప వెంకటేష్ గుప్తా పిలుపు.
Kadtal: కడ్తాల్‌లో 2,000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ!
Kadtal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ప్రజల్లో సామాజిక స్పృహ పెంపొందించడంతోపాటు సేవా కార్యక్రమాలతో గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల్లో గణపతి భక్తులలో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. నీటి వనరులు కలుషితం కావడం పర్యావరణం దెబ్బతినేలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాల తయారీ తగ్గించడానికి గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా చేస్తున్న కృషి అభినందనీయం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కడ్తాల్ ఆర్యవైశ్య సంఘం మరియు గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను శనివారం కడ్తాల్ పట్టణంలోని మిల్క్ చిల్లింగ్ సెంటర్ ముందు భక్తులకు వేద పండితులు శ్రీధర్ పంతులు, మూర్తి గారు ఆశీర్వచనలు పూజలు చేసిన 2000 మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణ రక్షిద్దాం అనే నినాదంతో గత 11 సంవత్సరాలుగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్న గంప లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ ఆయన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మట్టితో తయారుచేసిన వినాయకులను పంపిణీ చేయడం శుభపరిమాణం అన్నారు. పర్యావరణహితం అందరి అభిమతం అని మట్టితో బంధం భక్తితో రూపం మనందరి అభిమాతమని వారన్నారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకే రసాయనాలు లేని మట్టి గణపతులనే పూజించి, ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను నిమజ్జనం చేస్తే అవి తిరిగి మట్టిలో కలిసిపోయి పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని తెలిపారు.
గంప లక్ష్మయ్య ట్రస్ట్ చేస్తున్న సేవలు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పలు సామాజిక సేవా కార్యక్రమాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో చేసిన సేవలను పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బి రామకృష్ణ, ట్రెజరర్ కర్ణాకర్, ఆర్యవైశ్య సంఘం పొలిటికల్ అధ్యక్షుడు అర్థం రవికుమార్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు వీరేంద్ర గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు అర్థం వాసుదేవులు, సభ్యులు సాయి, వీరేష్, నంద కిరణ్, పసుపుల వీరేష్, గుద్దేటి శ్రీను, రఘు, శ్రీకాంత్, కృష్ణయ్య, విజయ్ గుప్తా, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి, కౌన్సిలర్ ఎనుముల రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అమృతం పాండు, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. గోపీనాథ్, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి రామకృష్ణ, మాజీ ఎంపిటిసి లచ్చిరాం నాయక్, జోగు వీరయ్య, ఉపసర్పంచ్లు మహేష్ యాదవ్, రామకృష్ణ, పాండు, మాజీ వార్డు సభ్యులు హెచ్ఆర్ మహేష్, రామచంద్రయ్య, న్యాయవాది సంతోష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అమృతం పాండు, నాయకులు దాసు, సురేష్, రాయకంటి సురేష్, సిద్ది గారి సురేష్, దాస్, హనుమాన్ యూత్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, మాదారం మహేష్ గౌడ్, శ్రీశైలం ఆదివాసి, కిరణ్ ఆదివాసి, యశ్వంత్, మల్లేష్, యాదయ్య గౌడ్, కాంటెక్టర్ సాయి, మంగళపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.




