Kachiguda: బీసీ సాధికారతకు ఐక్య పోరాటం అవసరం బండారు దత్తాత్రేయ
Kachiguda: బెంగళూరు ఓబీసీ జాతీయ మహాసభ వాల్ పోస్టర్‌ను కాచిగూడలో ఆవిష్కరించిన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల ఐక్యతకు పిలుపు.
Kachiguda: బీసీ సాధికారతకు ఐక్య పోరాటం అవసరం బండారు దత్తాత్రేయ
కాచిగూడ: బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బెంగళూరులో నిర్వహించనున్న ఆగస్టు 7 న బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాచిగూడ లోఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు బీసీ నేతలతో కలిసి మహాసభ సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
దేశ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులు సాధించుకోగలరని అన్నారు . ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. బెంగళూరు బీసీ జాతీయ మహా సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




