Kavitha: నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!
Kavitha: గంధం గోపాల్ మృతి పట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ విస్మరించారని మండిపడ్డారు.
Kavitha: నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!
కవిత: నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది,2017లో నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఘటనలో పోలీసుల చిత్రహింసలకు గురైన బాధితుడు గంధం గోపాల్ గారు పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం అత్యంత బాధాకరం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అప్పటి హామీలను అమలు చేయలేదు.
నేరెళ్ల బాధితులకు ఎన్నో హామీలు ఇచ్చి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు మాట నిలబెట్టుకోలేదు,గంధం గోపాల్ గారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను,త్వరలోనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి న్యాయం జరిగేలా మా పోరాటం కొనసాగిస్తాం.




