Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వార్షికోత్సవం

Hyderabad: జూబ్లీహిల్స్ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవం. హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, నటులు సాయికుమార్, మాదాల రవి. వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ ఆవిష్కరణ.

RAJESH,	WEST ZONE
Published on: 12 Aug 2026 4:39 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వార్షికోత్సవం

హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఆరోగ్య సంరక్షణలో నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలు కీలకమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని నటుడు సాయికుమార్ పేర్కొన్నారు.

స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. భరత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక, విశ్వసనీయమైన డయాగ్నస్టిక్ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. నాలుగేళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు, సిబ్బంది, అతిథులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story