Jubilee Hills: కర్మికనగర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Jubilee Hills: కర్మికనగర్ డివిజన్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.

RAJESH,	WEST ZONE
Published on: 20 Aug 2026 4:07 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: కర్మికనగర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Jubilee Hills: దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కర్మికనగర్ డివిజన్‌లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ సి.ఎన్. రెడ్డి గారు పాల్గొని రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో ఆధునికతకు పునాది వేసిన రాజీవ్ గాంధీ గారి సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story