Jubilee Hills: ఏ.జి. కాలనీ బీఎల్‌ఏలను సత్కరించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

Jubilee Hills: ఏ.జి. కాలనీ లో ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) పనులపై సమీక్షించి, బీఎల్‌ఏలను సత్కరించారు.

RAJESH,	WEST ZONE
Published on: 22 July 2026 10:05 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: ఏ.జి. కాలనీ బీఎల్‌ఏలను సత్కరించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్: డు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ఏ.జి. కాలనీ డివిజన్‌లో నిర్వహించిన ఎస్‌.ఐ.ఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు వంటి ప్రక్రియలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఎస్‌.ఐ.ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని, ప్రతి బూత్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

ఈ సందర్భంగా గ్రౌండ్ స్థాయిలో ఎస్‌.ఐ.ఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ అంకితభావంతో పనిచేసిన బీఎల్‌ఏలు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే గారు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఇదే ఉత్సాహంతో ప్రతి బూత్‌లో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఓటరికి సేవలు అందించాలని సూచించారు. పార్టీ కోసం నిస్వార్థంగా కృషి చేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎస్‌.ఐ.ఆర్ కో-ఆర్డినేటర్ భవాని శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనోజ్ గారు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story