Jubilee Hills: మానవత్వం చాటుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్!
Jubilee Hills: షేక్‌పేట్‌లో తప్పిపోయిన ఆరేళ్ల బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా చేర్చిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Jubilee Hills: మానవత్వం చాటుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్!
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు చేర్చిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం రాత్రి షేక్‌పేట్‌లో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డుపక్కన సుమారు ఆరేళ్ల బాలుడు ఏడుస్తూ కనిపించాడు. వెంటనే వాహనం ఆపి బాలుడిని ఆరా తీయగా, ఇంటి నుంచి తప్పిపోయినట్లు గుర్తించారు.
దీనిపై ఎమ్మెల్యే వెంటనే టోలిచౌకి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి వివరాలు సేకరించి అతని తల్లిదండ్రులను గుర్తించి క్షేమంగా అప్పగించారు. బాలుడిని సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంలో చొరవ చూపిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను స్థానికులు అభినందించారు
Next Story




