Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు!

Hyderabad: నియోజకవర్గం ఎల్లారెడ్డిగూడలో మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.

RAJESH,	WEST ZONE
Published on: 2 Sept 2026 12:36 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు!

Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు..

రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు..

వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story