Hyderabad: స్ప్రింట్ డయాగ్నస్టిక్ నాలుగో వార్షికోత్సవం

Hyderabad: జూబ్లీహిల్స్ స్ప్రింట్ డయాగ్నస్టిక్ నాలుగో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్. కుటుంబ వెల్‌నెస్ కార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే.

RAJESH,	WEST ZONE
Published on: 12 Aug 2026 10:34 PM IST
Hyderabad
X

Hyderabad: స్ప్రింట్ డయాగ్నస్టిక్ నాలుగో వార్షికోత్సవం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్-05లోని స్ప్రింట్ డయాగ్నస్టిక్ సెంటర్ నాలుగో వార్షికోత్సవ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం,డాక్టర్ భరత్ గారు, డాక్టర్ కార్తీక్ గారు, తరుణ్ గారు,లక్ష్మి గారు, ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

అనంతరం కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కుటుంబ వెల్‌నెస్ కార్డును ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌గా ప్రారంభమైన స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సంస్థ నేడు ఆరు శాఖలుగా విస్తరించడం అభినందనీయమని అన్నారు..

ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడంలో సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆధునిక వైద్య పరీక్షలు, మెరుగైన సేవలను అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు సేవలను విస్తరించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సంస్థ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే గారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story