Hyderabad: ప్రొఫెసర్ జయలక్ష్మిని జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా కొనసాగించాలి!

Hyderabad: జేఎన్టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మిని కొనసాగించాలని బీసీ మహిళా సంఘం డిమాండ్. తొలగిస్తే ఆమరణ నిరాహార దీక్షలని హెచ్చరిక.

GIRI, CENTRAL ZONE
Published on: 2 Aug 2026 7:37 PM IST
Hyderabad
X

Hyderabad: ప్రొఫెసర్ జయలక్ష్మిని జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా కొనసాగించాలి!

హైదరాబాద్: జేఎన్టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని యధావిధిగా పదవిలో కొనసాగించాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. మణిమంజరి సాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమెను తొలగించే ప్రయత్నాలు మహిళా సమాజాన్ని, ముఖ్యంగా బీసీ మహిళలను అవమానించడమేనని ఆమె విమర్శించారు.

హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో నిర్వహించిన బీసీ మహిళా సంఘం రాష్ట్ర అత్యవసర సమావేశంలో బి. మణిమంజరి సాగర్ మాట్లాడారు. జేఎన్టీయూ ఏర్పడి 54 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు 27 మంది రిజిస్ట్రార్లు పనిచేశారని, వారిలో ఒక్క మహిళకు కూడా అవకాశం రాలేదని తెలిపారు.

అలాంటి పరిస్థితుల్లో తొలిసారిగా ఒక బీసీ మహిళ అయిన ప్రొఫెసర్ జయలక్ష్మికి వైస్‌ చాన్స్‌లర్ అవకాశం కల్పించారని, అయితే 45 రోజులు కూడా పూర్తి కాకముందే ఆమెను తొలగించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని అన్నారు.

ఒకవైపు మహిళా సాధికారత గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ప్రతిభతో ఉన్న మహిళలకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరించడం సమంజసం కాదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్ వంటి మహిళా నేతలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు.

ప్రొఫెసర్ జయలక్ష్మిని జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో బీసీ మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఏకమై సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని బి. మణిమంజరి సాగర్ హెచ్చరించారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story