Hyderabad: వేస్ట్ టు బెస్ట్: JIFD విద్యార్థుల అద్భుత ఫ్యాషన్ డిజైన్స్!

Hyderabad: ప్రపంచ ఫ్యాషన్ డే సందర్భంగా జూబ్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (JIFD) ఆధ్వర్యంలో 'బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్' ప్రదర్శన జరిగింది.

RAJESH,	WEST ZONE
Published on: 20 Aug 2026 3:48 PM IST
Hyderabad
X

Hyderabad: వేస్ట్ టు బెస్ట్: JIFD విద్యార్థుల అద్భుత ఫ్యాషన్ డిజైన్స్!

హైదరాబాద్: ప్రపంచ ఫ్యాషన్ డే సందర్భంగా జూబ్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (JIFD) ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఉపయోగించిన పాత పాలిథిన్ కవర్లతోను ప్యాకింగ్ కు ఉపయోగించే అల్యూ మినియం రాపర్లతో అందమైన, వినూత్నమైన దుస్తులను రూపొందించారు. “బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్” కాన్సెప్ట్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఊహాశక్తి, డిజైన్ నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే గార్మెంట్ మోర్ఫాలజీ ఆధారంగా వివిధ కళాకృతులను రూపొందించి ఫ్యాషన్‌పై తమ సృజనాత్మక దృక్పథాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేఘన విద్యార్ధుల తో మాట్లాడుతూ ఫ్యాషన్ అంటే కేవలం దుస్తుల రూపకల్పన మాత్రమే కాదని, కొత్త ఆలోచనలకు రూపం ఇవ్వడం కూడా ఫ్యాషన్‌లో భాగమేనని విద్యార్థులకు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేఘన, మేనేజర్ సౌమ్య, ఫ్యాకల్టీ సుధారాణి, దివ్య, అఖిల జూబ్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story